AP Rains: కొనసాగుతున్న ద్రోణి.. మరో 12 గంటల్లో..
ABN , Publish Date - May 21 , 2025 | 05:32 PM
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, 36 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈరోజు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మరో ఐదు రోజుల పాటు కూడా ఈదురుగాలులతో కూడా వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో పలు జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు పశ్చిమ, తూర్పు జిలాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
అటు తెలంగాణలోనూ పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి