AP Renewable Energy Projects: పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లకు సింగిల్ విండో అనుమతులు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:12 AM
ఏపీలో పునరుత్పాదక విద్యుత్తుకు ప్రభుత్వ మద్దతుతో సింగిల్ విండ్ అనుమతుల విధానాన్ని అమలు చేస్తుందని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 5000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు

ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి
ఇంటర్నేషనల్ హైడ్రో అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్లకు సింగిల్ విండ్ విధానంలో అనుమతులు ఇస్తున్నామని ఇంటర్నేషనల్ హైడ్రో అసోసియేషన్‌కు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సమావేశమయ్యారు. పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో పాటు యాజమాన్య నిర్వహణా విధానాలపై సమీక్షించారు. పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో చాగంటి, రాజుపాలెం, గడికోట, అవవేటిపల్లి, దిన్నెపల్లి ప్రాంతాల్లో సుమారు 5000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.