Secretary Vidyasagar : ఉద్యోగుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:59 AM
ఉద్యోగుల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యమని ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎ.విద్యాసాగర్ పేర్కొన్నారు.
ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్
ధర్నాచౌక్(విజయవాడ), డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యమని ఏపీఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎ.విద్యాసాగర్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించి ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మంగళవారం విజయవాడలోని జింఖానగ్రౌండ్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఎన్జీ వో హోం నుంచి ఉద్యోగులతో భారీర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శివారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. అవసరమైతే ఆందోళనబాట పడతానని, వారి సంక్షేమానికి కృ షి చేస్తానని తెలిపారు. సంఘం మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీఎన్‌జీజీవో సహాధ్యక్షులు దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.