Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ఏడుగురు భక్తులు మృతి..
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:20 PM
నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో వినాయక చవితి ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మరణించారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అమరావతి: దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా జరుగుతోంది. అయితే నిమజ్జనం సందర్భంగా ఆంధ్రపదేశ్‌లోని పలు జిల్లాల్లో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు భక్తులు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో వినాయక చవితి ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను తూర్పు గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి(35) , మురళి(38), కడియం దినేష్(9), ఈమన సూర్యనారాయణ (58)గా గుర్తించారు. కాగా, క్షతగాత్రులను నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. చింతలవీధి గ్రామంలో వినాయక నిమజ్జనం కోసం వెళుతుండగా ఓ స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చింది. ఊరేగింపులో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీతారామ్, కొండబాబు అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పాడేరు ఆసుపత్రికి తరలించారు.
ఇక, నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం సముద్రతీరంలో గణేశ నిమజ్జనం కోసం వెళ్లిన కావలి వైకుంఠపురానికి చెందిన పులి లక్ష్మి(16) అనే యువతి ప్రమాదవశాత్తూ మృతిచెందింది. కాగా, ఈ ఘటనలతో అటు భక్తులు, బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
For More AP News And Telugu News