Pawan Kalyan: సేనతో సేనాని.. సభలో ఆసక్తికర సన్నివేశం..
ABN , Publish Date - Aug 30 , 2025 | 07:49 PM
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు కార్యచరణ గురించి పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్నారు. భవిష్యత్తు కార్యచరణ గురించి పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పవన్ అభిమానులు హాజరయ్యారు (Pawan Kalyan).
ఈ నేపథ్యంలో శనివారం సేనతో సేనాని సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కర్ణాటక నుంచి పలువురు అభిమానులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆ అభిమానుల నుంచి పవన్ కర్ణాటక రాష్ట్ర అధికారిక జెండాను తీసుకున్నారు. ఆ జెండాను పట్టుకొని కండువాను కప్పుకున్నారు. సేనతో సేనాని సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి అభిమానులు తరలివచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News