Share News

AP Minister Atchannaidu: టమోటా రైతులను ఆదుకుంటాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:36 PM

టమోటా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు గరిష్టంగా రూ.18, కనిష్ఠంగా రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి.

AP Minister Atchannaidu: టమోటా రైతులను ఆదుకుంటాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి
AP Minister Atchannaidu

టమోటా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు గరిష్టంగా రూ.18, కనిష్ఠంగా రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి. టమోటా రేటు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారిని ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు (Atchannaidu tomato farmers).


వర్షాల కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు టమోటా ఎగుమతి తగ్గిందని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయని అచ్చెన్న పేర్కొన్నారు. పత్తికొండ మార్కెట్‌‌కు 30 నుంచి 40 మెట్రిక్ టన్నులకు మించి టమోటా రాదని, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామన్నారు (tomato price crisis).


పత్తికొండ మార్కెట్‌లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్‌కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తామన్నారు (farmer support AP). టమోటాలకు ట్రెండింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తోందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 01:36 PM