AP High Court : వారి బెయిల్ పిటిషన్లకు విచారణార్హత లేదు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:22 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో పలువురు నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ సోమవారం హైకోర్టు కొట్టివేసింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
పలువురి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో పలువురు నిందితులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లకు విచారణార్హత లేదంటూ సోమవారం హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదైన నేపథంలో చట్టనిబంధనల ప్రకారం దిగువ కోర్టులోనే బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చా రు. వైసీపీ హయాంలో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి జరిగింది. 2023లో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశా రు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీహెచ్ కృష్ణారావు మరో 32 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశా రు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.