AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో 245 ఉద్యోగాలు..
ABN , Publish Date - May 29 , 2025 | 06:58 PM
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అమరావతి: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టులో ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో రెగ్యులర్ బేస్‌లో 242, అలాగే కాంట్రాక్ట్ పద్దతిలో 3 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఏపీలో ఉద్యోగ నియామకాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2025ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఇటీవల కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,620 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే తాజాగా ఏపీ హైకోర్టులో ఖాళీగా ఉన్న మరో 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://aphc.gov.in/ సందర్శించవచ్చు.
Also Read:
సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్ నిందితులు..
మహానాడు గ్రాండ్ సక్సెస్.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం చంద్రబాబు
For More Telugu News