Share News

Liquor Scam: సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్‌ నిందితులు..

ABN , Publish Date - May 29 , 2025 | 06:48 PM

లిక్కర్ స్కామ్‌లో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు నలుగురు నిందితుల కస్టడీకి అనుమతించింది.

Liquor Scam: సిట్ కస్టడీకి లిక్కర్ స్కామ్‌ నిందితులు..
Liquor Scam

అమరావతి: లిక్కర్ స్కామ్‌లో నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడు రోజులు.. అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై వాదనలు పూర్తికావడంతో ఏసీబీ కోర్టు నేడు(గురువారం) తీర్పు వెల్లడించింది. నలుగురు నిందితులను రెండ్రోజులపాటు కస్టడీకి అనుమతించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచీ సాయంత్రం 6 గంటల వరకూ విచారించేందుకు సిట్ అధికారులకు అనుమతించింది.


కాగా, ఏపీ లిక్కర్ స్కాంపై పూర్తిగా దర్యాప్తు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాలు ఆధారంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలతోపాటు బాలాజీ గోవిందప్పను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అయితే, వీరిని తమ విచారణకు అప్పగించాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ఒకసారి కస్టడీకి తీసుకుని విచారించారు. మరోసారి అతడిని కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో రెండ్రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


అయితే, ఈ కేసులో అరెస్టు అయ్యి రిమాండ్‌లో ఉన్న బాలాజీ గోవిందప్ప.. తన అనారోగ్య రీత్యా బయట నుంచి ఆహారం తెచ్చుకునేందుకు కోర్టు అనుమతి కోరారు. సోమ, బుధ , శుక్రవారాల్లో బయట నుంచి భోజనం తెప్పించుకునేందుకు ఎసీబీ కోర్టు అనుమతించింది. జైలు అధికారి పర్యవేక్షణలో ఈ భోజనం గోవిందప్పకు అందాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Also Read:

మహానాడు గ్రాండ్ సక్సెస్.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం చంద్రబాబు

టీడీపీ కార్యకర్తల పోరాటంతో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది: లోకేష్‌

For More Telugu News

Updated Date - May 29 , 2025 | 07:52 PM