Share News

AP High Court: ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పండి

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:31 AM

ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని

AP High Court: ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టును భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దొంతిరెడ్డి నరసింహారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఈ పోస్టు భర్తీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకు సమయం కావాలని కోరారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 04:31 AM