AP Govt: 10 కొత్త పట్టణ అథారిటీలకు అభివృద్ధి అనుమతులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:37 AM
ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తగా ఏర్పాటైన 10 పట్టణాభివృద్ధి అథారిటీలకు అభివృద్ధి అనుమతులు ఇచ్చే అధికారాన్ని మళ్లీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిపివేసిన ఆ అనుమతులను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు

అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన 10 పట్టణాభివృద్ధి అథారిటీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధికి సంబంధించిన అనుమతులు ఇచ్చేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో ఏలూరు, అన్నమయ్య, కడప ఉడా, ఒంగోలు, చిత్తూరు, పీకేఎం, బొబ్బిలి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, అమలాపురం పట్టణాభివృద్ధి అథారిటీలు ఇకపై మిగిలిన పట్టణాభివృద్ధి అథారిటీల మాదిరిగా అభివృద్ధికి సంబంధించిన అనుమతులు ఇవ్వనున్నాయి. ఈ అథారిటీల ‘అభివృద్ధి అనుమతులను’ నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Read Latest AP News And Telugu News