AP Government Transfers: శాప్ ఎండీగా భరణి
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:50 AM
ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆథారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా చిత్తూరు డీఎ్‌ఫవోగా ఉన్న ఐఎ్‌ఫఎస్ అధికారి ఎస్.భరణిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పది మంది..
కాకినాడ డీఎ్‌ఫవోగా రామచంద్రరావు.. పది మంది అటవీ అధికారుల బదిలీ
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆథారిటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా చిత్తూరు డీఎ్‌ఫవోగా ఉన్న ఐఎ్‌ఫఎస్ అధికారి ఎస్.భరణిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పది మంది ఫారెస్ట్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారిగా ఎన్.రామచంద్రరావు, చిత్తూరు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌గా రవీంద్రనాథ్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. శ్రీశైలం డీఎ్‌ఫవో అబ్దుల్ రావూ్‌ఫను బదిలీ చేసి మార్కాపురం టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించింది. మార్కాపురం టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్‌ను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసింది. కోడూరు డీఎ్‌ఫవో జి.సుబ్బరాజును చిత్తూరు డీఎ్‌ఫవోగా బదిలీ చేసింది. వైల్డ్ లైఫ్ శిక్షణ పూర్తి చేసుకుని ఏపీలో రిపోర్ట్ చేసిన జి.శివకుమార్‌కు చిత్తూరు డివిజన్‌లోని లకవరం డీఎ్‌ఫవోగా పోస్టింగ్ ఇచ్చింది. మరో ఐదుగురిని సబ్ డీఎ్‌ఫవోలుగా బదిలీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News