AP Govt : ఇసుక అక్రమ తవ్వకాలపైమళ్లీ సమగ్ర నివేదిక
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:59 AM
జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పి స్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ నివేదన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పి స్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత ప్రభు త్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి జేపీ వెంచర్స్‌కు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) తీర్పు ఇచ్చింది. ఆ సంస్థకు రూ.18 కోట్ల జరిమానా విధించిం ది. ఈ తీర్పును 2023 మే 15న జేపీ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచా రణ జరిపింది. సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపి స్తూ.. ఏపీలో ఇసుక తవ్వకాలు ఆపేశామని తెలిపారు. ట్రైబ్యు నల్ తమకు భారీ జరిమానా విధించిందన్నారు. ఏపీ ప్రభు త్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా జోక్యం చేసుకుని.. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై గతంలోనే నివేదిక అందజేశామని.. అయితే తాజా గా మరో సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తాజాగా తీసుకున్న నిర్ణయాలు, గత నివేదికలో పొందుపరచని అంశాలతో సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలతో అఫిడవిట్ వేయాలని ఆ శాఖనూ ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం