Share News

AP Govt : రాష్ట్ర అతిథులుగా హైకోర్టు మాజీ సీజేలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:04 AM

ఇప్పటికే మాజీ సీజేలు ఏపీలో పర్యటించిన సమయంలో వారిని రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తూ ప్రభుత్వం

AP Govt : రాష్ట్ర అతిథులుగా హైకోర్టు మాజీ సీజేలు

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్ర అతిథులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే మాజీ సీజేలు ఏపీలో పర్యటించిన సమయంలో వారిని రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారు ఢిల్లీలో పర్యటించిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అతిథులుగా గుర్తిస్తూ ఏపీ భవన్‌లో వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 04:05 AM