Stipend For Trainee Constables: ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ గుడ్‌న్యూస్.. జీవో జారీ చేసిన హోంశాఖ
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:46 PM
డిసెంబర్ 16వ తేదీన మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్‌ను అందించింది. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4500 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం దాన్ని భారీగా పెంచి 12000 వేల రూపాయలు చేసింది. ఈ మేరకు హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు.
కాగా, డిసెంబర్ 16వ తేదీన మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ముగ్గరూ కలిసి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరినవారు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు స్టైఫండ్‌ను పెంచుతున్నామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా జీవో హోంశాఖ నెంబర్ 183 ను జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి