AP News: బార్ అండ్ రెస్టారెంట్లకు టెండర్ల గడువు పొడిగింపు..
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:56 PM
ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రభుత్వ బార్ అండ్ రెస్టారెంట్లకు టెండర్ల గడువును పొడిగింది. టెండర్ల డెడ్‌లైన్‌ను ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం రాష్ట్రంలోని 840 బార్లకు కొత్త పాలసీని రూపొందించింది.
ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లకు టెండర్ల గడువును పొడిగింది. టెండర్ల డెడ్‌లైన్‌ను ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది (Andhra Pradesh tender extension). ప్రభుత్వం రాష్ట్రంలోని 840 బార్లకు కొత్త పాలసీని రూపొందించింది. ఈ పాలసీ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాల పై మద్యం వ్యాపారులు ఆసక్తిగా లేరు. దీంతో టెండర్ల గడువు సమీపిస్తున్నా వారి నుంచి ఆసక్తి కనిపించటం లేదు (bar and restaurant tenders).
నిజానికి ఈ రోజు (మంగళవారం) సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు 43 బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తం 437 దరఖాస్తుల్లో 43 షాపులకు 4 చొప్పున 132 దరఖాస్తులు వచ్చాయి. మిగతా వాటికోసం కేవలం సింగిల్, డబుల్ అప్లికేషన్లు మాత్రమే రావడంతో ఎక్సైజ్ అధికారులు ఖంగుతిన్నారు (AP excise department). బార్ అండ్ రెస్టారెంట్ పాలసీలోనే లోపాలు ఉన్నాయని, దరఖాస్తులు చేయకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నారు.
డెడ్‌లైన్ ముగుస్తున్నా దరఖాస్తులు రాకపోవడంతో తుది గడువును ప్రభుత్వం 29 వరకు పెంచింది. అయినా సరే అప్లికేషన్లు పెట్టబోమని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. పాలసీలో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని పాలసీని తీసుకొచ్చారని వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..