Share News

AP EAPCET 2025: నేటి నుంచి ఏపీఈఏపీసెట్‌

ABN , Publish Date - May 19 , 2025 | 05:42 AM

కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్‌-2025 సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. మొత్తం 3,62,448 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం రిజిస్టర్ అయ్యారు.

AP EAPCET 2025: నేటి నుంచి ఏపీఈఏపీసెట్‌

జేఎన్టీయూకే, మే 18 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్‌-2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 3,62,448 మంది విద్యార్థులకు... ఇంజనీరింగ్‌కు 2,80,612 మంది, అగ్రికల్చర్‌ ఫార్మసీకి 81,836, రెండింటికీ 912 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 143, తెలంగాణలోని హైదరాబాద్‌లో 2 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా ప్రవేశం కల్పిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యంగా హాజరైనా అనుమతించరు.


ఇవీ చదవండి:

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 05:42 AM