Share News

AP EAP CET 2025: ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్

ABN , Publish Date - May 19 , 2025 | 10:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో AP EAP CET 2025 పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.

AP EAP CET 2025: ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్
APEAPCET 2025

AP EAP CET 2025: ఆంధ్రప్రదేశ్‌లో AP EAP CET 2025 పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈఏపీ సెట్‌ రెండు సెషన్లలో నిర్వహణ ఉంటుంది.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 నుంచి 5వరకు మరో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయి.

పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా మాత్రమే అనుమతించారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు నిర్దేశించిన గుర్తింపు కార్డు, నలుపు, నీలం రంగు బాల్‌ పాయింట్ పెన్నును మాత్రమే ఎగ్జామ్ హాల్ లోకి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌-ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఈఏపీ సెట్‌)-2025 కోసం గడువు ముగిసేసరికి 3,58,017 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్‌ విభాగానికి 2,77,507 మంది, అగ్రికల్చర్‌-ఫార్మశీ విభాగంలో 79,610 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు విభాగాలకు 900 మంది దరఖాస్తు చేశారు.


ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి


కుక్కను నమ్ముకున్నాడు

Updated Date - May 19 , 2025 | 10:28 AM