Share News

AP CM Chandrababu Naidu: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక.. రేపు ఢిల్లీకి చంద్రబాబు

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:20 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది.

AP CM Chandrababu Naidu: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక.. రేపు ఢిల్లీకి చంద్రబాబు
AP CM Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. ఆదివారం జరిగే పార్లమెంటరీ బోర్డు భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ఖరారు చేయబోతోంది. అనంతరం అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం కనబడుతోంది (Vice president of India).


ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఈనెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఆ కార్యక్రమానికి ముందుగా 20వ తేదీన ఎన్‌డీఏ నేతలు భేటీ కాబోతున్నారు. ఎన్డీఏ నేతల భేటీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకాబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో కూడా చర్చించనున్నారు.


ఇవి కూడా చదవండి

మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 17 , 2025 | 09:20 AM