AP Government: మరో 53,922 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:27 AM
రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా రూ. 53,922 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో 83,437 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీనికోసం 27 సంస్థల ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఎస్‌ఐపీబీ తాజాగా ఆమోదం తెలిపింది....
83,437 మందికి ఉద్యోగాలు
27 సంస్థల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం
క్లీన్ ఎనర్జీ రంగంలో అత్యధిక పెట్టుబడులు
నెల్లూరులో 578 కోట్లతో అదానీ విల్‌మార్
రెండు ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కులు
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా రూ. 53,922 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో 83,437 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీనికోసం 27 సంస్థల ప్రతిపాదనలకు రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) తాజాగా ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ. 2,181 కోట్లతో 2,783 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఇదివరకే ఆమోదం పొందిన సంస్థలు చేసిన సవరణలతో సహా.. క్లీన్‌ఎనర్జీ రంగంలో రూ. 42,171 కోట్ల పెట్టుబడులకు అనుమతి లభించింది. మొత్తం 19,835 మందికి ఈ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థల ద్వారా ఉద్యోగాలు రానున్నాయి. పర్యాటక రంగంలో రూ. 550 కోట్లతో 775 మందికి ఉద్యోగాలను కల్పించేలా చేసిన ప్రతిపాదనలకూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ. 314 కోట్లతో 11,000 మందికి ఉద్యోగాలను ఇచ్చే ఎంఎ్‌సఎంఈ ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులకు చేసిన ప్రతిపాదనలను గ్రీన్‌సిగ్నల్ లభించింది. అదేవిధంగా రూ. 2,713 కోట్లతో రెండు ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. ఏపీఐఐసీ ప్రతిపాదించిన రూ. 1,597 కోట్ల ప్రతిపాదనలతో 1,179 మందికి ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమల స్థాపనకూ ఆమోదం లభించింది. ఇక రాష్ట్రంలో రూ. 3,183 కోట్లతో పరిశ్రమలు స్థాపించి 2,694 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకుగాను ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఎస్‌ఐపీబీలో ఆమోదం లభించిన కంపెనీల్లో కొన్ని..
మదర్ డెయిరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు రాయితీలు. ఈ సంస్థ రూ. 427 కోట్ల పెట్టుబడితో 160 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.
ఏసీఈ ఇంటర్నేషనల్ రూ.786 కోట్లతో 1,000 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
అపోలో టైర్స్, ఎర్లీబర్డ్‌కూ ప్రోత్సాహకాలు.
అనకాపల్లిలో రూ.485 కోట్లతో 500 మందికి ఉద్యోగాలు కల్పించే బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్‌కు ఆమోదం.
నెల్లూరులో రూ.578 కోట్లతో 265 మందికి ఉపాధిని ఇచ్చే అదానీ విల్‌మార్‌కు ఓకే.
చిత్తూరులో రూ. 85 కోట్లతో 120 మందికి ఉపాధినిచ్చే టైరోమెర్ లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్.
కడపలో రూ. 369 కోట్లతో 600 మందికి ఉద్యోగాలు కల్పించే రామ్‌షై బయో ప్రైవేటు లిమిటెడ్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
కోనసీమ జిల్లాలో రూ.161 కోట్లతో 189 మందికి ఉద్యోగాలను ఇచ్చే శ్రీసర్వారాయ షుగర్స్ లిమిటెడ్‌కూ అనుమతి.
టెలీకమ్యూనికేషన్స్ సంస్థ హెచ్‌ఎ్‌ఫసీఎల్‌కు 1,000 ఎకరాలు కేటాయించేందుకు అనుమతి.
రూ. 32 కోట్లతో 3,500 ఉద్యోగాలను కల్పించే వరాహ ఆక్వా ప్రతిపాదనలకు ఆమోదం.
జే కుమార్ ఇన్‌ఫ్రా ప్రతిపాదించిన రూ. 237 కోట్ల పెట్టుబడి ద్వారా 5,000 మందికి ఉద్యోగాల కల్పించే ప్రతిపాదనకు సమ్మతి.
కుప్పంలో రూ. 45 కోట్లతో 2500 మందికి ఉద్యోగాలు కల్పించే అలీప్ ప్రతిపాదనకు ఓకే.
ఇఫ్కో కిసాన్ సెజ్ చేసిన రూ. 370 కోట్ల పెట్టుబడి, 25,000 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు సమ్మతించారు.
ధీరూభాయ్ అంబానీ గ్రీన్‌టెక్ పార్క్ లిమిటెడ్ రూ. 1,843 కోట్లతో 19,000 మందికి ఉద్యోగాలను కల్పించే ప్రతిపాదనలకు ఆమోద ముద్ర.
భోగాపురం విమానాశ్రయం సమీపంలో తాజ్ వివాంతా ఎన్‌కామ్ వైజాగ్ హోటల్ పేరిట ఫోర్‌స్టార్ హోటల్ స్థాపనకు ఆమోదం.
అమరావతిలో మంజీరా హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ హాలిడే ఇన్ బ్రాండ్‌తో హోటల్ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులో రూ. 276 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. 225 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
ముంతాజ్ హోటల్స్ (ఒబెరాయ్ గ్రూప్) విల్లాలు, రిసార్టులు నిర్మించేందుకు అనుమతి.
సెకీ 600 మెగావాట్లు/1200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ను రూ. 1500 కోట్లతో ఏర్పాటు చేయడానికి, 960 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు అలాగే, సెకీ రూ. 800 కోట్లతో 200 మందికి ఉద్యోగాలు కల్పించే 50 మెగావాట్ల పవన, 60 మెగావాట్లు /72 మెగావాట్ల సౌర విద్యుత్, 10 మెగావాట్ల/20 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ఏర్పాటుకు ఆమోదం లభించింది.
సెరెంటికా రెన్యూవబుల్స్ ఇండియా రూ. 2,000 కోట్లతో 250 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు, అలాగే రూ. 2,400 కోట్లతో 380 మందికి ఉద్యోగాలు ఇచ్చే 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం.
హెక్సా ఎనర్జీ బీహెచ్ ఫైవ్ లిమిటెడ్ రూ. 1,200 కోట్లతో 400 మందికి ఉద్యోగాలు ఇచ్చే సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టుకు ఓకే.
రిఫెక్స్ సోలార్ ఎస్పీవీ ప్రైవేటు లిమిటెడ్ రూ. 480 కోట్లతో 345 మందికి ఉపాధిని ఇచ్చే 100 మెగావాట్ల సోలార్ పవర్‌కు ఆమోదం.
బ్రైట్ ఫ్యూచర్ రూ. 3,286 కోట్లతో అనంతపురంలో 440 మందికి ఉద్యోగాలు ఇచ్చే 349 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్టుకు ఆమోదం.
నవయుగ ఇంజనీరింగ్ రూ. 15,455 కోట్లతో 8,400 మందికి ఉపాధి కల్పించే గుజ్జిలి పీఎస్సీని 1500 మెగావాట్ల నుంచి 2400 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం.
చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ రూ. 15,050 కోట్లతో 8,400 మందికి ఉపాధిని ఇచ్చే కొప్పోలు పీఎస్‌పీని 360 నుంచి 2,400 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు అనుమతి.
సైర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ రూ.1,500 కోట్లతో 2,170 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..