AP News: బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు శుభవార్త.. లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:31 PM
బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు భారీగా తగ్గనుంది. లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా కల్పించనుంది.
బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు భారీగా తగ్గనుంది (Bar license Fee). లైసెన్స్ ఫీజును తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా కల్పించనుంది. ఈ పాలసీ బార్ లైసెన్సీలకు లాభదాయకంగా మారనుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సి వచ్చేది. బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపుతో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది (AP News).
కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ. 1.97 కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 55 లక్షలకు తగ్గించారు. అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించారు. తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు, ఒంగోలులో రూ. 1.4 కోట్ల నుంచి రూ. 55 లక్షలకు తగ్గించినట్లు వెల్లడి ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు. లైసెన్స్ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం ఉంది. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలకు తగ్గించారు.
రాష్ట్రం అంతటా ఒకే తరహాలో దరఖాస్తు రుసుమును రూ. 5 లక్షలగా నిర్ధారించారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి బార్ లైసెన్సులను బహిరంగ లాటరీ ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. కొత్త దరఖాస్తుదారులను నూతన బార్ పాలసీ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News