Municipal Corporation: త్వరలో తక్షణ మ్యుటేషన్ వ్యవస్థ
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:19 AM
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో తక్షణ ఆటో మ్యుటేషన్ వ్యవస్థను ప్రారంభించనున్నారు..
ఆస్తి మ్యుటేషన్‌లో విప్లవాత్మక మార్పులు
1 నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో తక్షణ ఆటో మ్యుటేషన్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. ఈ వినూత్న డిజిటల్ కార్యక్రమాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ రికార్డుల్లో యజమాని పేరును మార్చడం ప్రస్తుతం ప్రహసనంగా ఉన్న నేపథ్యంలో ఆటో మ్యుటేషన్ ఊరట కలిగించనుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజుతో పాటు ఆస్తి పన్ను, ఖాళీ భూముల పన్ను, నీటి చార్జీలు, సెవరేజ్ చార్జీల బకాయిలు వసూలు చేస్తారు. అప్పుడే మున్సిపల్ డేటా బేస్‌లో యజమాని పేరును అప్‌డేట్ చేస్తారు. దాని కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా, పన్నుల వసూళ్లు వేగవంతమవుతాయి. రిజిస్ట్రేషన్, మున్సిపల్‌శాఖల మధ్య సమన్వయంతో పాటు పారదర్శకత, సమయ పాలన, పట్టణ ప్రణాళికకు కచ్చితమైన డేటా అందుతుంది. ముందుగా 17 మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేసి ఆ తర్వాత మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో అమలు చేస్తారు. 17 కార్పొరేషన్ల కమిషనర్లు, జిల్లా రిజిస్ర్టార్, సబ్ రిజిస్ట్రార్‌లకు, మున్సిపల్ సిబ్బందికి శిక్షణ అందిస్తారు. 48 గంటల్లోగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ఆటో మ్యుటేషన్ వ్యవస్థ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. దేశంలోనే పట్టణ డిజిటల్ పాలనలో ఆదర్శంగా నిలుస్తుందని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News