AP High Court : తొక్కిసలాట, భక్తుల మృతికిగవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారు?
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:38 AM
తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని...

ప్రతివాదుల జాబితా నుంచి వారిని తొలగించండి
పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం... 22కు వాయిదా
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని వేసిన పిల్‌లో గవర్నర్ కార్యదర్శిని, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చడంపై హైకోర్టు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది. తొక్కిసలాట ఘటనకు వారు ఎలా బాధ్యులౌతారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని గుర్తు చేసింది. రిజిస్ట్రీ సూచించిన విధంగా గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి తదనుగుణంగా వ్యాజ్యంలో సవరణలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే బుధవారం, 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేశ్ రెడ్డి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.