Tirupati : భళా...బాదంచెట్టు
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:22 AM
పాతికేళ్ల క్రితం చేతివృత్తుల శిక్షణా కేంద్రం కోసం ప్రభుత్వం వలయాకారంలో 15గదులతో రెండంతస్తుల భవనం నిర్మించింది.
తిరుపతి అర్బన్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పరిధిలోని మంగళం ట్రెండ్స్ పాఠశాలలోని బాదం చెట్టు ఇది. పాతికేళ్ల క్రితం చేతివృత్తుల శిక్షణా కేంద్రం కోసం ప్రభుత్వం వలయాకారంలో 15గదులతో రెండంతస్తుల భవనం నిర్మించింది.భవనం నడిబొడ్డున ఖాళీ స్థలంలో బాదం చెట్టు నాటారు. కాలక్రమంలో శిక్షణా కేంద్రాన్ని మూతబడగా నిరుపయోగంగా ఉన్న ఆ భవనాన్ని 2001లో జడ్పీ పాఠశాలకు అప్పగించారు. మరమ్మతులు చేపట్టారు. మధ్యలో పెరుగుతున్న బాదం చెట్టు చుట్టూ దిమ్మెకట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు దాన్ని సంరక్షిస్తూ రావడంతో ఆ చెట్టు ఏపుగా పెరిగింది. ఆ భవనం రెండో అంతస్తు మధ్య ఉన్న వలయాకారం ఖాళీస్థలం వరకు పూర్తిగా రెమ్మలు, ఆకులతో వ్యాపించింది. ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ చెట్టుకింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. విద్యార్థులు చదువుకుంటున్నారు.