Share News

AGRICULTURE: వరికి జింక్‌, పొటాషియం లోపం

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:13 AM

జింక్‌, పొటాషి యం లోపం వల్లే వరి పంట తెగు ళ్ల బారిన పడిందని కదిరి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రామసుబ్బయ్య, శాస్త్రవేత్త డాక్టర్‌ రమే్‌షనాయక్‌ తెలిపారు.

AGRICULTURE: వరికి జింక్‌, పొటాషియం లోపం
Scientists giving instructions to farmers

నంబులపూలకుంట, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జింక్‌, పొటాషి యం లోపం వల్లే వరి పంట తెగు ళ్ల బారిన పడిందని కదిరి ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రామసుబ్బయ్య, శాస్త్రవేత్త డాక్టర్‌ రమే్‌షనాయక్‌ తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతి పత్రికలో ‘వదలని పీడ..!’ అనే శీర్షికతో కథనం ప్రచురితమయింది. స్పందించిన శాస్త్రవేత్తలు గురువారం మండలంలోని వంకమద్ది ఆయకట్టు చెరువు కింద సాగుచేసిన వరిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ.. వరిపంటకు జింక్‌, పొటాషియం లోపం ఉందని, దీనిని నివారించకపోతే పంట ఎదుగుదల ఉండదని అన్నారు. పొటాషియం లోపం నివారణకు ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. జింక్‌లోపం నివారణకు జింక్‌ సల్ఫేడ్‌ 2గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. పిలకదశలో ఉన్న సమయంలో ఎకరాకు 50 కిలోల యూరియా వాడాలన్నారు. వెన్నుదశలో 50 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్‌ వినియోగించాలన్నారు. కాండం తొలుచు పురుగు, ఆకుముడత నివారణకు కోరాజిన 0.3ఎంఎల్‌ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంవల్లే చీడపీడలు ఆశించాయని పేర్కొన్నారు. వీరి వెంట వ్యవసాయాధికారి లోకేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 12:13 AM