‚Kalava : జగనకు చెంపపెట్టు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:48 AM
పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం జగనకు చెంపపెట్టు అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలపై గురువారం ఆయన కణేకల్లులో విలేకరులతో మాట్లాడారు. మూడున్నర దశాబ్దాల తర్వాత పులివెందులలో ..
ప్రభుత్వ విప్ కాలవ
కణేకల్లు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం జగనకు చెంపపెట్టు అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలపై గురువారం ఆయన కణేకల్లులో విలేకరులతో మాట్లాడారు. మూడున్నర దశాబ్దాల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడ అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని తెలిపారు. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదంటే జగనపై పులివెందుల ప్రజలకు ఎంత కోపం ఉందో ఈ ఎన్నికల ద్వారా బహిర్గతమైందన్నారు. అడుగడుగునా అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న జగన అరాచకానికి అక్కడి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. టీడీపీ విజయం పట్ల సాధారణ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకుంటున్నా రని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మెన హనుమంతరెడ్డితో పాటు టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, షేక్‌ముజ్జు, చంద్రశేఖర్‌గుప్తా, మాబుసాబ్, చాంద్‌బాషాతోపాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.