CLINIC: హెల్త్ క్లినిక్ ప్రారంభం ఎప్పుడో..?
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:38 PM
మండలపరిధిలోని సోమ యాజులపల్లిలో విలేజీ హెల్త్ క్లినిక్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గ్రామీణులకు వై ద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వంలో దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో రూ. 23లక్షల నిధులు కేటాయించారు. దీంతో నిర్మాణం పూర్తి అయి యేడాది అవుతోంది. అయితే కాంట్రాక్టర్‌కు ఇంకా 20శాతం బిల్లులు రావాల్సిఉందని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు అంటున్నారు.

గాండ్లపెంట, జూన 30(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని సోమ యాజులపల్లిలో విలేజీ హెల్త్ క్లినిక్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో అని ఆ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. గ్రామీణులకు వై ద్యం అందించే లక్ష్యంతో గత ప్రభుత్వంలో దీనిని నిర్మించారు. దీని నిర్మాణానికి అప్పట్లో రూ. 23లక్షల నిధులు కేటాయించారు. దీంతో నిర్మాణం పూర్తి అయి యేడాది అవుతోంది. అయితే కాంట్రాక్టర్‌కు ఇంకా 20శాతం బిల్లులు రావాల్సిఉందని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు అంటున్నారు. యేడాదిక్రితమే భవనం పూర్తి అయినా బిల్లులు అందకపోవడంతో కాంట్రాక్టర్ తాళాలు ఇవ్వలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. దీంతో గ్రామ సచివాలయంలోని ఓ భవ నంలో అసౌకర్యాల నడుమ చికిత్సలు అందిస్తున్నారు. ఈ గ్రామ సచివాలయం పరిధిలో 13గ్రామాలు ఉన్నాయి. వీరికి వైద్యం అందించాలంటే సిబ్బంది ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నా రు. ఇప్పటికైనా అఽధికారులు, ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టుకు రావాల్సిన బిల్లులు అందించి, నిర్మాణం పూర్తయిన హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ రాజ్ జేఈ రెడ్డివరప్రసాద్‌ను వివరణ కోరగా... కాం ట్రాక్టర్‌కు కొద్దిగా బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. ఆ బిల్లులు వస్తే తాళాలు ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పాడని జేఈ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....