Share News

MLA KANDIKUNTA: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:11 AM

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. బుఽధవారం సాయంత్రం శమీనారాయణస్వామి ఆలయంలో చేనేతల సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు.

MLA KANDIKUNTA: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
Speaking MLA Kandikunta

ధర్మవరం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. బుఽధవారం సాయంత్రం శమీనారాయణస్వామి ఆలయంలో చేనేతల సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట హాజరై మాట్లాడారు. చేనేతలందరూ ఐక్యంగా సమస్యలపై పోరాటాలుచేసి పరిష్కరించుకోవాలన్నారు. ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లితే పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. పట్టుచీరల తయారీ సంఘం నాయకులు గిర్రాజు రవి, జయశ్రీ, గడ్డం శ్రీనివాసులు, పోలా ప్రభాకర్‌, నీలూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:11 AM