Share News

యాడికి కాలువకు నీటి విడుదల

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:12 AM

మండలకేంద్రం మీదుగా వెళ్లే పీఏబీఆర్‌ దక్షిణ కాలువ నుంచి యాడికి కాలువకు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలహారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నార్త్‌కెనాల్‌ నుంచి ..

యాడికి కాలువకు నీటి విడుదల
JC Prabhakar Reddy inspecting the water release

పెద్దవడుగూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రం మీదుగా వెళ్లే పీఏబీఆర్‌ దక్షిణ కాలువ నుంచి యాడికి కాలువకు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జలహారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నార్త్‌కెనాల్‌ నుంచి 250క్యూసెక్కులు కిష్టిపాడు రెగ్యులేటర్‌ వద్దకు చేరి అక్కడి నుంచి మూడు భాగాలుగా విడిపోయి రాయలచెరువు, యాడికి కెనాల్‌, పెండేకల్లు రిజర్వాయర్‌కు చేరడం వల్ల భూగర్భజలాలు పెంపొందుతా యన్నారు. ఈ సందర్భంగా లస్కర్‌ వీరాంజనేయులును జేసీ ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుయువత ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర ఆరె కటిక సంఘం చైర్మన హరికృష్ణారావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, దస్తగిరి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:12 AM