JC: సకాలంలో రైతులకు యూరియా
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:51 PM
సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు.
పెనుకొండ రూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): సకాలంలో రైతులకు యూరియాను అందించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వ్యవసాయాదికారులకు సూచించారు. సోమవారం మండలంలోని నాగలూరు గ్రామ రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. అక్కడ రైతులతో పంట స్థితిగతులపై ఆరాతీశారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. ఏఓ చందన, ఏఈఓ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
ఫ మడకశిర రూరల్: యూరియాపై రైతులు ఇందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి తిమ్మప్ప తెలిపారు. మండలానికి సంబంధించి యూరియా ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆయా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోమవారం గుండుమల రైతు సేవాకేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గుండమల మాజీ సర్పంచు చంద్రప్ప రైతు సేవాకేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఫ గుడిబండ : రైతులకు ఎరువులు కొరత రానివ్వమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివా్‌సమూర్తి అన్నారు. సోమవారం వ్యవసాయ కార్యాలయంలో ఏఓ వీరనరే్‌షతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, ప్రధాన కార్యదర్శి, శ్రీనాథ్, వీవో వీరనరేష్, రైతులు పాల్గొన్నారు.
ఫరొళ్ల : స్థానిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ప్రభుత్వం సరఫరా చేసిన యూరియాను మండలంలోని రైతులకు సోమవారం మండల వ్యవసాయ అధికారి వెంకటబ్రహ్మంతో కలిసి మండల టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మార్కెట్‌యార్డ్ చైర్మన గురుమూర్తి, మండల కన్వీనర్ ఈరన్న, భరత, నాగేంద్ర, రామక్రిష్ణ, రవి పాల్గొన్నారు.
ఫలేపాక్షి : డివిజన పరిధిలో ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ అన్నారు. సోమవారం కల్లూరు ఆర్బీకేలో ఎరువుల పంపిణీని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ యూరియా కొరత లేదని కొంతమంది పుట్టించే పుకార్లు నమ్మవద్దన్నారు. అనంతరం యూరియాను సరఫరా చేశారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఆర్బీకే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.