Share News

థర్డ్‌ డిగ్రీ..!

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:47 AM

కొందరు పోలీసులు థర్డ్‌ డిగ్రీ పేరుతో చితకబాదుతుండటంతో నిందితులు కొందరు ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. పోలీ్‌సస్టేషన్లలో లాఠీ దెబ్బలు తినడం కంటే చావడమే మేలు అన్నట్లుగా కత్తులతో కుత్తుకలు, చేతులు స్టేషన పరిసరాల్లోనే...

థర్డ్‌ డిగ్రీ..!
Police are taking Prakash, who had his hand cut off, for treatment

నిందితులను చితకబాదుతున్న పోలీసులు

తాళలేక ఆత్మహత్యలకు యత్నిస్తున్న బాధితులు

కట్టుతప్పుతున్న ఖాకీల ట్రీట్‌మెంట్‌

జరుగుతున్న ఘటనలే ఉదాహరణ

అనంతపురం క్రైం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కొందరు పోలీసులు థర్డ్‌ డిగ్రీ పేరుతో చితకబాదుతుండటంతో నిందితులు కొందరు ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. పోలీ్‌సస్టేషన్లలో లాఠీ దెబ్బలు తినడం కంటే చావడమే మేలు అన్నట్లుగా కత్తులతో కుత్తుకలు, చేతులు స్టేషన పరిసరాల్లోనే కోసుకునే పరిస్థితికి వస్తున్నారు. మూడు రోజులు కిందట కంబదూరు మండలంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.

గంజాయి కేసేస్తాం!

కంబదూరులోని వడ్డే కాలనీలో ఉంటున్న ప్రకాష్‌ చిల్లర కొట్టు నిర్వహించేవాడు. అప్పులు అధికం కావడంతో కొట్టు బంద్‌ చేసిన


ట్లు సమాచారం. అయితే ప్రకాష్‌ తల్లి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర అంగడిపెట్టుకుని కర్ణాటక నుంచి మద్యం తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలో పోలీసులు సుమారు 20 నుంచి 28 వరకూ టెట్రా ప్యాకెట్లు దొరికాయని, తల్లి స్థానంలో ప్రకా్‌షను మూడు రోజుల కిందట స్టేషనకు తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉంచుకున్నారు. ఈక్రమంలోనే థర్డ్‌ డిగ్రీ పేరుతో బాగానే కోటింగ్‌ ఇచ్చారట. రాత్రి 10 గంటలకు వదిలేసి, ఉదయం రావాలని హెచ్చరించినట్లు తెలిసింది. కేసు లేకుండా చేయాలంటే డబ్బులు ఇవ్వాలని లేదా 4 కేసుల మద్యం తెచ్చివ్వాలంటూ హెచ్చరించినట్లు సమాచారం. ‘మీరు అడిగింది మేం చేయలేం సార్‌’ అంటూ ఆయన పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు ‘ఏయ్‌ గంజాయి కేసు పెట్టి, లోపల వేసి 4 నెలలు రిమాండ్‌కు పంపుతాం’ అంటూ బెదిరించారట. దీంతో అప్పటికే దెబ్బలతో ఒళ్లు హూనం కావడం, గంజాయి కేసు, రిమాండ్‌ అనే సరికి తీవ్ర ఆందోళన చెందిన ప్రకాష్‌ కూరగాయలు కోసే చాకుతో స్టేషన వద్దే తన ఎడమ చెయ్యి కోసుకున్నాడు. దీంతో పోలీసుల్లో టెన్షన మొదలైంది. ప్రకా్‌షను వైద్యం కోసం దగ్గర్లో ఉన్న కళ్యాణదుర్గం పట్టణంలో కాకుండా హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు.

తాడిపత్రిలోనూ ఇదే సీన

సుమారు నెల కిందట తాడిపత్రి పోలీసులు ఓ కేసుకు సంబంధించి ఇద్దరు వైసీపీ కార్యకర్తలను స్టేషనకు పిలిచినట్లు సమాచారం. ఓ కేసు విషయంలో చితకొట్టారు. ఆ థర్డ్‌ డిగ్రీ దెబ్బలకు ఆ ఇద్దరు భీతిల్లిపోయారు. మళ్లీ కొన్ని రోజులకు ఆ ఇద్దరినీ స్టేషనకు పిలిచారు. అప్పటికే పోలీసుల లాఠీ దెబ్బలకు ఉక్కిరిబిక్కిరైన వాళ్లను అనంతపురం తీసుకెళ్తారని తెలిసింది. దీంతో ఆ ఇద్దరిలో ఒక నిందితుడు ఇక వేధింపులు భరించడం తన వల్ల కాదంటూ తన వద్ద ఉన్న చాకుతో గొంతు కొసుకున్నట్లు సమాచారం. దీంతో తాడిపత్రి పోలీసులు హుటాహుటిని బాధితుడిని అనంతపురం తీసుకొచ్చి రహస్యంగా వైద్య చికిత్సలు అందించినట్లు తెలిసింది. విచారణ పేరుతో స్టేషనకు తీసుకువచ్చి ఇలా పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. థర్డ్‌ డిగ్రీ అధికారం ఏ డిగ్రీ ఇచ్చిందని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. మరి థర్డ్‌ డిగ్రీ పోలీసులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో..?

Updated Date - Aug 29 , 2025 | 12:47 AM