Share News

TDP : ఎదురుచూపులు ఫలించాయి..

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:08 AM

ఆశావహుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నామినేటెడ్‌ పదవుల పంపకాలు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 31 మందికి చైర్మన పదవుల హోదా కల్పిస్తూ జాబితా విడుదల చేశారు. జిల్లాలో ...

TDP : ఎదురుచూపులు ఫలించాయి..
Tdp Leaders

ఎట్టకేలకు నామినేటెడ్‌ పదవుల పంపకాలు

జిల్లాలో నలుగురికి చోటు

రెండోసారి రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మనగా ప్రకా్‌షనాయుడు

కొత్తగా గుడుపూటి నారాయణస్వామి, స్వప్న, హరికృష్ణ రావుకు అవకాశం

అనంతపురం ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఆశావహుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నామినేటెడ్‌ పదవుల పంపకాలు చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 31 మందికి చైర్మన పదవుల హోదా కల్పిస్తూ జాబితా విడుదల చేశారు. జిల్లాలో నలుగురికి అవకాశం కల్పించారు. ఇందులో ముగ్గురికి తొలిసారిగా చైర్మన హోదా దక్కింది. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రీయాశీలక కార్యకర్తగా పనిచేస్తూ.. పార్టీలో అనేక పదవుల్లో పనిచేసిన చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకా్‌షనాయుడుకు రెండోసారి మాంసాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మనగా అవకాశం కల్పించారు. పార్టీ విధేయతకు పట్టం కట్టారనేందుకు చంద్రదండు ప్రకా్‌షనాయుడు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యువ నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేపడుతూ.. కష్టాల్లోనూ.. నష్టాల్లోనూ పార్టీ వెన్నంటే నడిచారు. చంద్రబాబునాయుడుకు రక్షణ కవచంగా చంద్రదండును స్థాపించారు. చంద్రబాబు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా... చంద్రదండు అక్కడ వాలిపోయి... ఆయనకు బలమైన వలంటీర్‌ వ్యవస్థగా పనిచేస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి


వచ్చిన తర్వాత ప్రకాష్‌నాయుడుకు మాంసాభివృద్ధి చైర్మనగా పదవి కట్టబెట్టారు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అదే పదవి ఇవ్వడం గమనార్హం.

కొత్తగా ముగ్గురికి అవకాశం

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన-5 ఇనచార్జిగా పనిచేస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన గుడుపూటి నారాయణస్వామిని ఏపీ వికలాంగులు, వృద్ధపౌరుల సహాయ కార్పొరేషన చైర్మనగా నియమించారు. విద్యార్థి, తెలుగు యువత నాయకుడిగా నారాయణస్వామి అనేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా... పార్టీ కోసం క్రీయాశీలకంగా పనిచేశారు. నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో వలంటీర్లకు నాయకత్వం వహించారు. లోకేశ వెన్నంటే నడిచారు. తెలుగుదేశం పార్టీలో చురుకైన మహిళా నాయకురాలిగా, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అనంతపురం అర్బనకు చెందిన స్వప్నకు ఏపీ వీరశైవ లింగాయత, లింగ బలిజల అభివృద్ధి, సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్‌పర్సనగా నియమించారు. దశాబ్దన్నరకిపైగా ఆమె పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఏపీ అరికటిక, కటిక కుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండల కేంద్రానికి చెందిన హనుమంత కరి హరికృష్ణరావును ఏపీ అరికటిక, కటిక, ఆర్‌ సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి సంఘం చైర్మనగా నియమించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హరికృష్ణారావు తండ్రి లక్ష్మణ్‌ రావు కీలకంగా పనిచేశారు. హరికృష్ణ వదిన పెద్దవడుగూరు టీడీపీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న హరికృష్ణరావుకు చైర్మన హోదా కల్పించారు.

Updated Date - Aug 13 , 2025 | 01:08 AM