Rain : దంచికొడుతున్న వాన
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:45 AM
జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం వాన దంచికొట్టింది. అనంతపురం, పుట్లూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. రాయదుర్గం, నార్పల, తాడిపత్రి, బొమ్మనహాళ్, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలోని 7 మండలాల్లో గురువారం రాత్రి వర్షం పడింది. పుట్లూరు 4.8, అనంతపురం 4.2, విడపనకల్లు 4.0, రాప్తాడు 3.4, ఉరవకొండ 2.0, గుత్తి 1.8, బొమ్మనహాళ్‌లో 1.2 మీ.మీ వర్షపాతం ..
ఉమ్మడి జిల్లాలో
పలు ప్రాంతాల్లో వర్షం
అనంతపురం అర్బన/కొత్తచెరువు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం వాన దంచికొట్టింది. అనంతపురం, పుట్లూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. రాయదుర్గం, నార్పల, తాడిపత్రి, బొమ్మనహాళ్, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. జిల్లాలోని 7 మండలాల్లో గురువారం రాత్రి వర్షం పడింది. పుట్లూరు 4.8, అనంతపురం 4.2, విడపనకల్లు 4.0, రాప్తాడు 3.4, ఉరవకొండ 2.0, గుత్తి 1.8, బొమ్మనహాళ్‌లో 1.2 మీ.మీ వర్షపాతం నమోదైంది.
నల్లమాడలో అత్యధిక వర్షపాతం
జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురవగా, మిగిలిన మండలాల్లో వర్షం పడలేదు. ఇందులో గురు వారం రాత్రి 9 మండలాల్లో
అత్యధిక వర్షం కురిసింది. నల్లమాడ మండలంలో అత్యధికంగా 50 మిల్లిమీటర్ల వర్షం పడింది. లేపాక్షి మండ లంలో 47.2 మిల్లీమీటర్లు, ఓబుళదేవరచెరువలో 45.4, తాడిమర్రి 39.2, నల్లచెరువులో 34.2, కదిరిలో 31.2, గోరంట్లలో 22.4,బుక్కపట్నం 22, ముదిగుబ్బలో 20.4,గాండ్లపెంటలో 20, త నకల్లు 18.8,ధర్మవరం 18.2, తలుపుల 15.4, నంబలపూలకుంట14.2, నల్లచెరువు చిలమత్తూరు 9.4,అమడగూరు 5.4,పుట్టపర్తి 3.2,కొత్తచెరువులో 1.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మండలంలోని లింగారెడ్డిపల్లి, కణిశెట్టిపల్లి, నారేపల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది.
ఐదు రోజులకు వర్షసూచన
బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలిక పాటి లేదా ఓ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త గుత్తా నారాయణస్వామి తెలిపారు. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 32-33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 22-22.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చన్నారు. వాయవ్యం దిశగా గాలులు గంటకు 8-12కి.మీవేగంతో వీచే అవకాశము ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 78-83, మధ్యాహ్నం 52-73 నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అనంతపురం 9న 22.4 మి.మీ, 10న 12 మి.మీ 11న 7.1 మి.మీ , 1.2న 2.8 మి.మీ 13న 5.1 మి.మీ కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 9న 30.3 మి.మీ, 10న 9.1 మి.మీ 11న 7.5 మి.మీ, 1.2న 2.6 మి.మీ 13న 4 మిమీ కురిసే అవకాశం ఉందన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..