JUDGE: సమాజంలో రుగ్మతలు రూపుమాపాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:02 AM
సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు.
హిందూపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, తదితర రుగ్మతులను రూపుమాపాలని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం మండలంలోని వినాయకనగర్‌లో న్యాయవిజ్ఞానసదస్సు నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రస్తుత తరుణంలో మాదకద్రవ్యాలు పట్టి పీడిస్తున్నాయన్నారు. వాటి నిర్మూలనకు కృషిచేయాలన్నారు. బాల్యవివాహాలవల్ల చాలా అనర్థాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ న్యాయం పొందవచ్చని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్నారు. డీటీ మైనుద్దీన, సర్పంచ భాగ్యమ్మ, న్యాయవాదులు కళావతి, సంతో్‌షకుమారి, రవిచంద్ర, ప్రకాశ, నరేష్ పాల్గొన్నారు.
విద్యతోనే జీవితాల్లో మార్పు
చిలమత్తూరు(ఆంధ్రజ్యోతి): విద్యతోనే జీవితాల్లో మార్పు వస్తుందని హిందూపురం సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర నాయక్ అన్నారు. మండలంలోని దిగువపల్లి తండాలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారి హాజరై నమాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల కోసం రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించిందన్నారు. అన్ని రకాలుగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ కులాలను అందరితో సమానంగా రాజ్యాంగం హక్కులు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలన్నారు. విద్యతోనే వెనుకబడిన జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. ఎంతో మంది వెనుకబడిన కులాల్లో జన్మించినా వారు విద్యావంతులు కావడంతోనే అత్యున్నత స్థాయిలో ఉండగలుగుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ట్రైబల్ యాక్ట్, పోక్సో చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థలో అందరూ సమానమేనని, ఎవరు తప్పు చేసినా శిక్ష ఒక్కటే ఉంటుందన్నారు. బాల్య వివాహాలకు దూరంగా ఉంటూ పిల్లలకు సరైన వయసు వచ్చిన తరువాతే వివాహాలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీ జగన్నాథం, ఎంపీడీఓ రమణమూర్తి, సర్పంచ నీలాబాయి, కార్యదర్శి భాస్కర్, బాబేనాయక్, చంద్రానాయక్, కృష్ణానాయక్, న్యాయవాది కృష్ణమూర్తి పాల్గొన్నారు.
రొళ్ల (ఆంధ్రజ్యోతి): మండలంలోని మళ్లినమడుగు దళిత కాలనీలో శనివారం కాలనీవాసులకు రెవెన్యూ ఇనస్పెక్టర్ గిరియప్ప పౌరహక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టాల గురించి విద్య ఆవశ్యకత, సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివిధ అంశాల గురించి ప్రజలకు వివరించారు. ఏఎ్‌సఐ హిదాయతుల్లా, వీఆర్‌ఓ గిరి, గ్రామప్రజలు పాల్గొన్నారు.