TDP: మైనార్టీల అభివృద్ధికి టీడీపీ పెద్దపీట
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:50 PM
ముస్లిం మైనార్టీలకు టీడీపీ హయాంలోనే ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు.
గుంతకల్లు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీలకు టీడీపీ హయాంలోనే ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి అన్నారు. మంగళవారం మండలంలోని ఎన కొట్టాలకు చెందిన 30 కుటుంబాలు నారాయణ స్వామి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరాయి. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు షేక్ ఖాసీం వలి, షేక్ హుసేన, గడార్ల ఖాజా, సయ్యద్ రజాక్ సాబ్, ఖాదర్‌బాషా, మహబూబ్ సాబ్, బాషు, రజని తదితర కుటుంబాలవారు టీడీపీలో చేరారు. నాయకులు బండారు ఆనంద్, బీఎస్ కృష్ణారెడ్డి, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, వెంకటేశులు పాల్గొన్నారు.