ఆస్పత్రిలో అదనపు ఓపీ కౌంటర్లకు అడుగులు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:53 AM
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో జిల్లా సర్వజనాస్పత్రిలో ఓపీ కష్టాలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘కిటకిట’ శీర్షికన ఆస్పత్రిలో ఓపీ కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. ఆదయాన్నే ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి ఓపీ కేంద్రాల వద్దకు ...

అడ్మినిస్ట్రేటర్ పరిశీలన
వైద్యులతో చర్చలు.. మరో నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయం
అనంతపురం టౌన, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో జిల్లా సర్వజనాస్పత్రిలో ఓపీ కష్టాలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘కిటకిట’ శీర్షికన ఆస్పత్రిలో ఓపీ కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. ఆదయాన్నే ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి ఓపీ కేంద్రాల
వద్దకు చేరుకున్నారు. ఆయుష్మాన భారత ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సౌజన్యకుమార్, ఇతర డాక్టర్లతో ఓపీ కౌంటర్ల సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతం మహిళలు, పురుషులకు మూడు చొప్పున కౌంటర్లు ఉన్నాయన్నారు. సోమ, మంగళ, బుధవారాల్లోనైనా ఓపీ కష్టాలు తలెత్తకుండా మహిళలు, పురుషులకు మరోరెండు చొప్పున అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అడ్మినిస్ట్రేటర్ తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....