Biometric : బయటా.. లోపలా.. బయోమెట్రిక్..
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:31 AM
స్థానిక సర్వజనాస్పత్రిలో దివ్యాంగ పింఛన రీ వెరిఫికేషనలో బోగ్‌సల ఆట కట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొందరు బోగ్‌సలు రీవెరిఫికేషనలో బయట బయోమెట్రిక్ వేసి.. లోపలికి వైకల్యం ఉన్నవారిని పంపించి డాక్టర్లను మస్కా కొట్టించి వైకల్యం ఉన్నట్లు ఆమోదం వేయించుకుంటున్నారు. ఆర్థో, దృష్టిలోపం పరీక్షల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు డాక్టర్లే గుర్తించి, అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలపై ‘రీ వెరిఫికేషనలో మాయగాళ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్ సైతం ఈ మోసాలపై ఆరాతీసి, సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో గురువారం వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషన నిర్వహిస్తున్న ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక నిఘాచర్యలు తీసుకున్నారు. తొలుత వచ్చిన వారు రిజిస్ట్రేషన చేసుకున్న తర్వాత సీరియల్ నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా పేరు పిలిచి, వారికి బయట బయోమెట్రిక్ తీసి లోపలికి ...

పింఛన రీ వెరిఫికేషనలో మాయలకు చెక్
పక్కాగా సర్టిఫికెట్ల పరిశీలన
అయినా ఆస్పత్రి దళారీ
సిబ్బంది అక్కడే తిష్ట
అనంతపురం టౌన, మార్చి 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సర్వజనాస్పత్రిలో దివ్యాంగ పింఛన రీ వెరిఫికేషనలో బోగ్‌సల ఆట కట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొందరు బోగ్‌సలు రీవెరిఫికేషనలో బయట బయోమెట్రిక్ వేసి.. లోపలికి వైకల్యం ఉన్నవారిని పంపించి డాక్టర్లను మస్కా కొట్టించి వైకల్యం ఉన్నట్లు ఆమోదం వేయించుకుంటున్నారు. ఆర్థో, దృష్టిలోపం పరీక్షల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు డాక్టర్లే గుర్తించి, అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలపై ‘రీ వెరిఫికేషనలో మాయగాళ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్ సైతం ఈ మోసాలపై ఆరాతీసి, సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో గురువారం వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషన
నిర్వహిస్తున్న ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక నిఘాచర్యలు తీసుకున్నారు. తొలుత వచ్చిన వారు రిజిస్ట్రేషన చేసుకున్న తర్వాత సీరియల్ నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా పేరు పిలిచి, వారికి బయట బయోమెట్రిక్ తీసి లోపలికి పంపుతున్నారు. లోపలకు వెళ్లాక డాక్టర్ గదిలో మరోసారి బయోమెట్రిక్ తీశారు. ఇలా రెండుసార్లు బయోమెట్రిక్ తీయడంతో బయట బయోమెట్రిక్ వేసిన వ్యక్తి.. లోపలకు వచ్చిన వ్యక్తి ఒకరేనా.. కాదా.. అని తెలిసిపోతుంది. అలా.. మోసాలకు అధికారులు ముకుతాడు వేశారు.
దళారీల తంటాలు..
అధికారులు వైకల్య సర్టిఫికెట్ల రీ వెరిఫికేషనలో మోసాలకు ఆ స్కారం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటుంటే.. అదే జిల్లా ఆస్పత్రి లో పనిచేస్తున్న దళారీ సిబ్బంది అక్కడే తిష్టవేసి ఎలాగైనా కమిట్‌మెంట్ చేసుకున్నవారి వైకల్యంపై ఆమోదం వేయించడానికి సర్వశక్తులు ఒడ్డుతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రీ వెరిఫికేషన ప్రాంతంలో డీఆర్‌డీఏ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనధికారికంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ విభాగాల సిబ్బంది, ఎంఎనఓలు, సెక్యూరిటీ స్టాఫ్ ఒప్పందం చేసుకున్నోళ్లకు వైకల్యం ఉన్నట్లు ఆమోదం వేయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. గతంలో ఆస్పత్రి హెచఓడీలతో వారికి ఈ బోగస్ వైకల్య మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయించారు. అవి నకిలీవని డాక్టర్లు రీవెరిఫికేషనలో తేల్చితే తమ బండారం బయటపడుతుందని కొందరు డాక్టర్లే.. ఆస్పత్రి ఇబ్బందిని రంగంలోకి దింపి రీ వెరిఫికేషనకు వచ్చిన శ్రీసత్యసాయి జిల్లా వైద్యులపై ఒత్తిడి పెం చుతున్నట్లు తెలుస్తోంది. గురువారం కూడా 8 మంది వరకు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది అక్కడే ఉంటూ తమదైన శైలిలో అక్రమదారులకు మార్గాలు చూపిస్తూ కనిపించారు. ఈ లెక్కన సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన మోసాల్లో ఆస్పత్రి సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరినీ నియమించలేదు: డా. వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్
రీ వెరిఫికేషన విధులకు ఆస్పత్రి సిబ్బంది ఎవరినీ నియమించలేదు. అక్కడ ఎందుకు ఉంటున్నారో తెలీదు. వారిపై ప్రత్యేకంగా విచారణ చేయించి, చర్యలు తీసుకుంటాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....