sports ఫైనల్‌కు ఎస్‌ఎస్‌బీఎన, ఎస్‌ఎల్‌ఎన జట్లు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:57 AM
ఎస్‌కే యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎ్‌సబీఎన, ఎస్‌ఎల్‌ఎన కళాశాలల జట్లు ఫైనల్‌కు చేరాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు.
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఎస్‌కే యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల్లో ఎస్‌ఎ్‌సబీఎన, ఎస్‌ఎల్‌ఎన కళాశాలల జట్లు ఫైనల్‌కు చేరాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు.
ఎస్‌కే యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జెస్సీ, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మశ్రీ పోటీలను ప్రారంభించారు. మొత్తం పది జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. సెమీఫైనల్స్‌లో ఆర్ట్స్ కళాశాలపై ఎస్‌ఎల్‌ఎన డిగ్రీ కాలేజీ, ఎస్‌ఎ్‌సజీఎస్ కళాశాలపై ఎస్‌ఎ్‌సబీఎన జట్లు గెలుపొంది ఫైనల్స్‌కు చేరాయి. కార్యక్రమంలో పీడీలు శ్రీరామ్, శత్రుజ్ఞ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..