Share News

FARMERS: పొలాల్లోకి వెళ్లకుండా కంచె ఏర్పాటు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:32 PM

మండలంలోని ము చ్చురామి గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే రహ దారికి అడ్డంగా కొంతమంది వ్యాపారులు కంచె ఏర్పాటు చేశారని రైతులు అవేదన వ క్తం చేశారు. సోమవారం ఆ గ్రామ రైతులు సీపీఐ నాయకుడు మధుతో కలసి స్థానిక తహసీల్దార్‌ కార్యాల యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో తహసీ ల్దార్‌ సురేష్‌బాబుకు వినతిపత్రం అందచేశారు.

FARMERS:  పొలాల్లోకి వెళ్లకుండా కంచె ఏర్పాటు
Farmers and CPI leaders giving petition to Tehsildar

- తహసీల్దార్‌కు విన్నవించిన రైతులు

ధర్మవరం రూరల్‌, జూన 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని ము చ్చురామి గ్రామానికి చెందిన రైతులు తమ పొలాలకు వెళ్లే రహ దారికి అడ్డంగా కొంతమంది వ్యాపారులు కంచె ఏర్పాటు చేశారని రైతులు అవేదన వ క్తం చేశారు. సోమవారం ఆ గ్రామ రైతులు సీపీఐ నాయకుడు మధుతో కలసి స్థానిక తహసీల్దార్‌ కార్యాల యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదికలో తహసీ ల్దార్‌ సురేష్‌బాబుకు వినతిపత్రం అందచేశారు. ఎన్నో ఏళ్లుగా తమ పొలాలకు ఆ రహదారికి గుండా వెళ్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల తమ పొలాలకు ముందు ఉన్న పొలాన్ని ధర్మవరానికి చెం దిన శివకుమార్‌ కొనుగోలు చేసి రస్తా లేకుండా ముళ్లకంచె వేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తహసీల్దార్‌ స్పంది స్తూ పొలాలకు రస్తా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుం టామన్నారు. కార్యక్రమంలో రైతులు ముచ్చు రామకృష్ణ, లక్ష్మయ్య, నారాయణస్వామి, సీపీఐ నాయకులు పుల్లాశెట్టి రవికుమార్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 30 , 2025 | 11:32 PM