Share News

రోగులకు మెరుగైన సేవలందించండి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:11 AM

రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచఓ ఫైరోజ్‌ బేగం సూచించారు. శనివారం మండలంలోని పట్నం ప్రభుత్వం ఆసుపత్రి, కుటాగుళ్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.

రోగులకు మెరుగైన సేవలందించండి

కదిరి అర్బన, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచఓ ఫైరోజ్‌ బేగం సూచించారు. శనివారం మండలంలోని పట్నం ప్రభుత్వం ఆసుపత్రి, కుటాగుళ్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరాతీసి, పలు రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ఆమెతోపాటు డిప్యూటీ డీఎంహెచఓ నాగేంద్రనాయక్‌, డాక్టర్లు వినోద్‌కుమార్‌, ఉషారాణి, వైద్య సిబ్బంది ఉన్నారు.

నల్లమాడ: మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఫైరోజ్‌ బేగం శనివారం తనిఖీ చేశారు. ఆరోగ్యసేవలపై ఆమె ఆరాతీశారు. అనంతరం రికార్డులు, ల్యాబ్‌, వాక్యినేషన గదులు, వార్డులు, ఆరోగ్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం ఎర్రవంకపల్లి గ్రామంలో జరుగుతున్న ఫ్యామిలీ వైద్యం చికిత్సలను పరిశీలించారు. వైద్యులు గణేనాయక్‌, సీహెచఓ రామాంజులు, ఎంపీహెచఎ్‌స మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

ముదిగుబ్బ: మండలంలోని మలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంఅండహెచఓ ఫైరోజ్‌బేగం శనివారం తనిఖీ చేశారు. పలు రికార్డులను, వ్యాక్సిన, లేబర్‌ రూంలు, రోగుల గదులు, ఓపీలను తనిఖీ చేశారు. సీజనల్‌ వ్యాధుల వివరాలు అడిగితెలుసుకున్నారు. వైద్యాధికారులు నాగేంద్రనాయక్‌, రోజా, ఎంపీహెచఓ వేణుగోపాల్‌రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:11 AM