సెల్‌క్షేపం..!
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:31 AM
సెల్‌క్షేపం..!Self-destruction..
ఇది బొమ్మనహాళ్ ఎంపీడీఓ కార్యాలయం. ఆశీనులైనవారంతా ప్రజలు ఎన్నుకున్న సర్పంచలు, పంచాయతీ కార్యదర్శులు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాల్సినవారే. గ్రామాల్లో పచ్చదనం పెంపు, పరిశుభ్రత పరిరక్షణపై వారికి ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బొమ్మనహాళ్‌లో కూడా మంగళవారం ఏర్పాటు చేశారు. మహిళా సర్పంచల స్థానంలో వారి భర్తలు, బంధువులు కూడా హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. స్ర్కీనపై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన చాలామంది ఇదిగో.. ఇలా.. సెల్‌ఫోన చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ కనిపించారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన శిక్షణలో సర్పంచలు, కార్యదర్శుల నిర్లక్ష్యంపై జనం విమర్శలు గుప్పిస్తున్నారు.
- బొమ్మనహాళ్, ఆంధ్రజ్యోతి