Revenue Department : ముడుపులిస్తేనే మోక్షం..!
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:51 AM
రెవెన్యూ శాఖలో ప్రతి పనికీ ఓ రేటు పెట్టారు. మాన్యువల్ డెత సర్టిఫికెట్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తుంటారు. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పైసలు లేకుండా ఏవైనా సర్టిఫికెట్లు, పత్రాలు తీసుకోవడం కుదరదనే విమర్శలున్నాయి. సర్వే కోసం వెళ్లినా ముడుపులు చెల్లించాల్సిందే. డైక్లాట్‌లో వివరాల కోసం పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇలాంటి పనులకు ఎంతో..
రెవెన్యూశాఖలో హెచ్చుమీరిన అక్రమాలు
సబ్‌డివిజన చేయాలంటే రూ.2లక్షలివ్వాలట
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌లో మాయాజాలం
లబోదిబోమంటున్న బాధితులు
అనంతపురం కలెక్టరేట్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖలో ప్రతి పనికీ ఓ రేటు పెట్టారు. మాన్యువల్ డెత సర్టిఫికెట్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తుంటారు. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పైసలు లేకుండా ఏవైనా సర్టిఫికెట్లు, పత్రాలు తీసుకోవడం కుదరదనే విమర్శలున్నాయి. సర్వే కోసం వెళ్లినా ముడుపులు చెల్లించాల్సిందే. డైక్లాట్‌లో వివరాల కోసం పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇలాంటి పనులకు ఎంతో
కొంత ఇస్తే చాలు పనైపోతుందని సామాన్యులు సైతం అంటున్నారంటే పరిస్థితి ఎంత ముదిరిపోయింతో అర్థం చేసుకోవచ్చు. ఇక సబ్ డివిజన చేసుకోవాలంటే సర్వేయర్‌ను, రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకోవడం సామాన్యుడికి తలకు మించిన భారం అవుతోంది. ఉన్నతాధికారులకు ఈ వ్యవహారం తెలిసినా చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరింత రెచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి.
పైసలిస్తేనేఫ్యామిలీ సర్టిఫికెట్
ఏదైనా భూమి ఆనలైనలో ఎక్కించుకునే క్రమంలో కావాల్సిన పత్రాలు, సర్టిఫికెట్లలో ప్రధానమైంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎ్‌ఫఎంసీ). ఈ సర్టిఫికెట్ రావాలంటే నెలపైగా ఎదురుచూడాల్సి ఉంటుంది. పైసలు ముట్టజెబితే త్వరగానే చేతిలోకి వచ్చేస్తుంది. ఆనలైనలో దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్‌ఓ నుంచి ఆర్‌ఐ వరకు సంబంధిత పత్రాలు పరిశీలిస్తారు. ఈ సర్టిఫికెట్ కోసం డిమాండ్‌ను బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక సరైన ఆధారాలు లేకుండా, గిమ్మిక్కులు చేయాలంటే మాత్రం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సర్టిఫికెట్ రూ.లకారాల్లో పలుకుతోందట. మూడు నెలల కిందట అనంతపురం పరిధిలో కీలకమైన పోస్టులో ఉండే ఓ రెవెన్యూ ఉద్యోగి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఏకంగా రూ.2లక్షలు వసూలు చేశాడట. ఈ విషయంపై అధికారపార్టీ ప్రజాప్రతినిధి తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఇతను పైసలు లేనిదే ఫైల్స్ ముట్టడనే ఆరోపణలున్నాయి.
సబ్ డివిజన చేయాలన్నా..
సబ్ డివిజన కోసం అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. జిల్లా అంతటా అన్ని మండలాల్లో ఇదే వ్యాపారం సాగుతోంది. గార్లదిన్నె తహసీల్దారు కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్న ఓ అధికారి సబ్‌డివిజన కోసం పెద్దగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన షబ్బీర్ అలీ సబ్‌డివిజన కోసం తహసీల్దార్ కార్యాలయం వెళ్లాడు. శిరివరంలోని సర్వేనెంబరు 217లో 3.50 ఎకరాల భూమిని ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా గతంలో మరొకరి పేరుతో ఆనలైనలో ఎక్కించి, పాస్‌బుక్కు అందజేశారనేది బాధితుని ఆరోపణ. ఈ నేపథ్యంలో కోర్టు పరిధిలో ఉన్న 3.5 ఎకరాలు మినహాయించి తమకు చెందిన 14 ఎకరాలు సబ్ డివిజన చేయాలని కోరాడు. ఇందుకు సంబంధిత అధికారి రూ.2లక్షలు ఇస్తే సబ్‌డివిజన చేస్తానని హామీ ఇచ్చారట. దీంతో తన భూమి సబ్ డివిజనకు అంత ఇచ్చుకోలేనని వెనక్కువచ్చేశాడట. మరోసారి అడిగినా ఆయన అదే విషయం చెబుతూ అది కాకపోతే ప్రత్యర్థి వర్గానికి ఎకరా భూమి రాసివ్వాలని బేరం పెట్టారట.
బోగస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌తో...
షబ్బీర్‌కే చెందిన కల్లూరులోని రూ.50లక్షల విలువైన 6 సెంట్ల స్థలాన్ని కొందరు రిజిస్ర్టేషన చేయించుకున్నారు. జూన 4న పామిడి సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ చేశారు. అయితే ఇది అక్రమమని బాధితుడు సబ్‌రిజిస్ర్టార్‌ను కలిశాడు. తాను వంశవృక్షం చూసి ఇచ్చానని పామిడి సబ్‌రిజిస్ర్టార్ చెప్పుకొచ్చారట. ఇదే విషయంలో గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయం అధికారులు జూన 13న ఎఫ్‌ఎంసీ జారీ చేయడం గమనార్హం. సంబంధిత వ్యక్తులకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్ నకిలీదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్థలం బాధితుడి పెదనాన్న ఇమాంసాబ్‌ది. ఆయన మృతి చెందాడు. ఆయన మొదటి భార్య హఫీజాబీ కొడుకు షెక్షావలి. అంతే. కానీ అవతలివారు రెండో భార్యగా షేక్ మస్తానబీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌లో సృష్టించారు. రెండో భార్య ఉన్నది వాస్తవమే అయితే ఆధార్‌లో, ఎఫ్‌ఎంసీలో, వంశవృక్షంలో తేడాలుండటం నకిలీదని స్పష్టం చేస్తోంది. దీనికితోడు ఇమాంసాబ్ పేరు కూడా తప్పుగా ఉంది. ఆధార్‌లో షేక్ మస్తాన బీ భర్త ఎస్.ఇమాములు అని ఉంది. గార్లదిన్నె మండల అధికారులు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌లో షేక్ మస్తానబీ భర్త వై.ఇమాంసాబ్ అని ఉంచారు. ఇక వంశవృక్షంలో వై.మస్తానబీ భర్త వై.ఇమాంసాబ్‌గా ఉంది. ఇంత గందరగోళం ఉంటే గార్లదిన్నె తహసీల్దార్ పేరుతో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారనేది సందేహాలకు తావిస్తోంది. అదేవిధంగా ఆనలైన మ్యుటేషనలోనూ వై.మస్తానబీ భర్త వై.ఇమాంసాబ్‌గా ఉంది.
డబ్బులు అడుగుతున్నారు: షబ్బీర్ అలీ, శిరివరం, గార్లదిన్నె మండలం
సర్వేనెంబరు 217లో 3.5ఎకరాలు ఆక్రమించారు. 14ఎకరాలు సబ్‌డివిజన చేయమంటే రెవెన్యూ అధికారులు డబ్బులు అడుగుతున్నారు. కల్లూరులోని ఆరు సెంట్లలోనూ అక్రమ రిజిస్ర్టేషన జరిగింది. ఆధారాలు లేకుండా ఎలా రిజిస్ర్టేషన చేస్తారు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సైతం రిజిస్ర్టేషన అయ్యాక ఎలా ఇచ్చారు. అందులోనూ అన్నీ తప్పులే ఉన్నాయి. అధికారులు ఇది గమనించలేరా..?
మరిన్ని అనంతపురం వార్తల కోసం..