CP Radhakrishnan to Puttaparthi: పుట్టపర్తికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:01 PM
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, అధికారులు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు (Sathya Sai Baba's Centenary Celebrations) ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పుట్టపర్తిలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఇవాళ(శనివారం) ఉదయం వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. తాజాగా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (Vice President CP Radhakrishnan) చేరుకున్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత, అధికారులు పుట్టపర్తి విమానాశ్రయం వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పూర్ణచంద్ర ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు. శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వారితోపాటు ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, శ్రీ సత్యసాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తిలకిస్తున్నారు. కాగా, మరికాసేపట్లో సత్యసాయి బాబా మహా సమాధిని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో
AP High Court: పరకామణి చోరీ కేసు.. జర్నలిస్టు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు