MLA KANDIKUNTA: సమస్యల పరిష్కారానికే పబ్లిక్ గ్రీవెన్స
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:04 AM
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ భవనంలో శనివారం ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.
వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశం
కళ్లుండీ చూడలేని వైఎస్ జగన
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ భవనంలో శనివారం ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. పట్టణానికి చెందిన మైనార్టీ మహిళలు సుమియా, హసీనా తమ 4.50 సెంట్ల భూమిని వైసీపీ నేతలు, న్యాయవాది జాఫర్‌ఖాన, రఘునాథ్‌రెడ్డి, నాగిరెడ్డి కబ్జా చేశారన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా, చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఆయన వెంటనే వీటిపై విచారణచేసి, కబ్జాకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్లు, రేషనకార్డులతో ప్రజలు అధిక సంఖ్యలో వినతులు అందించారు. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు విన్నవించారు. కొన్ని సమస్యలను ఎమ్మెల్యే అక్కడిక్కడే పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నేతల భూ అక్రమాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రజలకోసం ఆలోచిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు. పోలవరం, అమరావతి పనులకు నిధులు కేటాయిస్తోందన్నారు. కళ్లుండి చూడలేని నాయకుడు జగన్మోహనరెడ్డి అన్నారు. సంక్షేమమే అభివృద్ధిగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ మురళీక్రిష్ణ, ఎంపీడీఓ పొలప్ప, మండలస్థాయి అఽధికారులు, ప్రజలు కూటమినాయకులు పాల్గొన్నారు.