Pre-Christmas పీవీకేకే ఐటీలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:02 AM
మండలంలోని ఆలమూరు రోడ్డులోగల పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల స్టూడెంట్ యాక్టివిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅథితిగా కల్వరీ గ్రేస్ చర్చి పాస్టర్ పాల్ ఆరన హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు.
అనంతపురం రూరల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆలమూరు రోడ్డులోగల పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కళాశాల స్టూడెంట్ యాక్టివిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅథితిగా కల్వరీ గ్రేస్ చర్చి పాస్టర్ పాల్ ఆరన హాజరై క్రిస్మస్ విశిష్టతను వివరించారు.
విద్యార్థులు, అధ్యాపకులు ఆలపించిన క్రిస్మస్ క్యారల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం శాంటా క్లాజ్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తర్వాత కేక్‌కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన పల్లె కిశోర్, యాజమాన్యప్రతినిధి శ్రీకాంతరెడ్డి, ప్రిన్సిపాల్ రమే్‌షబాబు, వైస్ ప్రిన్సిపాల్ దీప్తి జోర్డానా, ఏఓ మనోహర్‌రెడ్డి, స్టూడెంట్ యాక్టివ్ సెల్ కన్వీనర్ ఆనంద్, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..