APTF: పీఆర్సీని నియమించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:27 AM
ద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
పుట్టపర్తిరూరల్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పీఆర్‌సీ కమిషనను వెంటనే నియమించి, ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తికి వినతి పత్రం అందచేశారు. రాజశేఖర్, నరే్‌షచౌదరి, సుధాకర్, లక్ష్మీపతి, చెన్నానాయక్, రవీంద్రారెడ్డి, రాజగోపాల్, శంకర్‌రెడ్డి రవిశంకర్, వెంకట రమణనాయక్, శ్రీనివాసులు, వెంకటేష్, సురేష్ పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు రాంకుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, బకాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి అందించారు. చిరంజీవి, చంద్రమౌలిరాజు, ఆంజనరెడ్డి, చంద్ర పాల్గొన్నారు. దసరా సెలవులు 24 నుంచి ఇవ్వడం సరికాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్‌లాజం, రాష్ట్ర నాయకులు షర్ఫోద్దిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 22 నుంచి సెలవులు ప్రకటించాలని, మధ్యంతర భృతిని వెంటనే ఇవ్వాలన్నారు.
కొత్తచెరువు(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీటీఎఫ్ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇనచార్జి తహసీల్దార్ బాలాంజనేయులుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్. చంద్ర, పూర్వపు అధ్యక్షుడు పీవీమాధవ, చెన్నకేశవులు, అక్కులప్ప, ఈశ్వరప్ప, రంగయ్య, ప్రసాద్, శ్రీకాంత పాల్గొన్నారు.
ధర్మవరంరూరల్(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలు పరిష్కారించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ బీకే ముత్యాలప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్రరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసులు, జేన్నే నాగప్ప, ఉమాపతి, పెద్దారెడ్డి, శ్రీనివాసులు, వాసుశంకర్, శివానంద, ఈశ్వరయ్య, గోపి, అంజినాయక్ పాల్గొన్నారు.
నల్లమాడ(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సాయిదీ్‌పరెడ్డికి వినతిపత్రం అందచేశారు. వెంకటరామిరెడ్డి, త్రిమూర్తితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.