నూతన కలెక్టర్ ఆనంద్
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:18 AM
జిల్లా నూతన కలెక్టర్‌గా ఆనంద్‌ను నియమించారు. నెల్లూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను జిల్లాకి నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ను బాపట్లకు బదిలీ చేశారు. 2024 మే...
వినోద్ కుమార్ బాపట్లకు బదిలీ
అనంతపురం కలెక్టరేట్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా నూతన కలెక్టర్‌గా ఆనంద్‌ను నియమించారు. నెల్లూరు కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను జిల్లాకి నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌గా పనిచేస్తున్న వినోద్‌కుమార్‌ను బాపట్లకు బదిలీ చేశారు. 2024 మే 4వతేదీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వినోద్‌కుమార్ 16 నెలలపాటు పనిచేశారు.
24 ఏళ్లకే కలెక్టర్...
నూతన కలెక్టర్ ఆనంద్ కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో 1992 ఫిబ్రవరి 4వతేదీ జన్మించారు. ఈ యన కేరళ యూనివర్సిటీలో ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్సలో 2015లో బీటెక్ పూర్తిచేశారు. 24 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అయ్యారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఆలిండియా 33వ ర్యాంకు
సాధించారు. శిక్షణ అనంతరం తూర్పు గోదావరి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. గూడూరు సబ్ కలెక్టర్‌గా, పోలవరం ఇరిగేషన ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్థించారు. ఐటీడీఏ, కేఆర్ పురం ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అనంతరం పార్వతీపురం మణ్యం జాయింట్ కలెక్టర్‌గా, విశాఖపట్నం పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ఉద్యోగోన్నతి పొందాక నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితుడయ్యారు. ఈ-గవర్నెన్స అంశంలో జాతీయ అవార్డు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లాకు నియమించారు.