Share News

MLA ASMITH: సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:52 PM

పట్టణంలోని గానుగవీధి, రాగితోటపాలెంలోని కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు.

MLA ASMITH: సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే
MLA talking to the colonists

తాడిపత్రి, జనవరి21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గానుగవీధి, రాగితోటపాలెంలోని కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు. వార్డుల్లో డ్రైనేజీ సమస్యతోపాటు కొందరు ఫించన్లు రాలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అర్హులైన వారికి పింఛన్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్య కూడా త్వరగా పరిష్కరిస్తామన్నారు. అక్కడే ఉన్న మున్సిపల్‌ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్లు విజయ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, రంగనాథరెడ్డి, లక్ష్మీదేవి, నాయకులు రంగనాయకులు, ఖాదర్‌బాషా, రామాంజనేయులు, విజ్జి, గంగరాజు, లచ్చి ఉన్నారు.

==================

Updated Date - Jan 21 , 2025 | 11:52 PM