CM MEETING: సీఎం సభను విజయవంతం చేయండి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:47 PM
అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.
అమరాపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం నిర్వహించే సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం సోమవారం మండల కన్వీనర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కార్యక్రమంలో భాగంగా 10న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనంతపురం విచ్చేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు పంచాయతీల్లో బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. మాజీ కన్వీనర్ శివరుద్రప్ప, నాగరాజు, నరసింహమూర్తి, మారుతిప్రసాద్, దాదాపీర్, సర్పంచ లోకేష్, చెన్నప్ప, కుమారస్వామి పాల్గొన్నారు.
గుడిబండ(ఆంధ్రజ్యోతి): స్థానిక వెలుగు కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, మహిళలతో సోమవారం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కార్యక్రమంలో భాగంగా 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మండల కన్వీనర్ లక్ష్మీననరసప్ప, శ్రీనాథ్, మంజునాథ్, దుర్గేష్, శివకుమార్, ప్రకాశ, నారాయణప్ప, నజీర్, అహ్మద్ జయరామప్ప, బాదిపల్లి అప్ప, పురుషోత్తం, నాగరాజు పాల్గొన్నారు.
రొద్దం(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో బుధవారం జరిగే సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కార్యక్రమానికి మండలంలోని ప్రతి సంఘం సభ్యురాలు తరలిరావాలని ఎంపీడీఓ రాంకుమార్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మండలపరిషత కార్యాలయంలో ఐకేపీ గ్రామైఖ్య సంఘం లీడర్లు, యానిమేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వస్తుందని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లను ఐకేపీ సీసీలు, యానిమేటర్లు తీసుకోవాలన్నారు. ఐకేపీ ఏపీఎం జయచంద్ర, వెలుగు సీసీలు, యానిమేటర్లు, గ్రామైఖ్య సంఘం లీడర్లు పాల్గొన్నారు.
సోమందేపల్లి: అనంతపురంలో 10న జరిగే సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో మండల నాయకులు ప్రసంగించారు. నాయకులు ఆంజనేయులు, కన్వీనర్ వెంకటేశులు, సిద్దలింగప్ప, భానుకీర్తి, శ్రీర
ారి సతీ్‌షకుమార్‌ను వివరణ కోరగా ఇదివరకే నా దృష్టికి వచ్చిందని త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు.