Share News

Gauthu Lachanna : లచ్చన్నను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:34 AM

సమాజ అభివృద్ధి కోసం నిత్యం శ్రమించిన సర్దార్‌ గౌతు లచ్చన్నను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్‌ఓ మలోల అభిప్రాయపడ్డారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సర్దార్‌ గౌతులచ్చన్న జయంతి నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్‌ఓ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌, బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తొలుత గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ స్వాతంత్య్రం ..

  Gauthu Lachanna : లచ్చన్నను ఆదర్శంగా   తీసుకోవాలి
Sardar Gautulachanna's birth anniversary

అనంతపురం కలెక్టరేట్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సమాజ అభివృద్ధి కోసం నిత్యం శ్రమించిన సర్దార్‌ గౌతు లచ్చన్నను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్‌ఓ మలోల అభిప్రాయపడ్డారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సర్దార్‌ గౌతులచ్చన్న జయంతి నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్‌ఓ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన రహార్‌, బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తొలుత గౌతు లచ్చన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీఆర్‌ఓ మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకమునుపే సమాజం, ప్రజల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి లచ్చన్న అని కొనియాడారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 40 సెంట్ల స్థలంలో బీసీ భవన, లక్షన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం గౌతు లచ్చన్న అంకితభావంతో పని చేశారన్నారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగభూషణం, ఈడిగ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్‌ కొండన్న, రజక కార్పొరేషన డైరెక్టర్‌ పరమేశ్వర్‌, పద్మశాలి కార్పొరేషన డైరెక్టర్‌ లక్ష్మీనరసింహులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగభూషణం, ఈడిగ సంఘం నాగేశ్వరరావు, గౌడ సంఘం శ్రీనివాసగౌడ్‌, సురేంద్రగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:34 AM